అమరావతి: మూడు రాజధానుల అంశంపై అమరావతి ప్రాంతంలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వెలగపూడిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైకాపా కార్యకర్తలే గ్రామపంచాయితీ కార్యాలయానికి రంగులు తుడిచేస్తామని ప్రకటించారు. వారికి గ్రామస్థులు మద్దతు తెలిపారు. వారంతా రంగులు తుడిచేస్తుండగా పోలీసులు అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పోలీసుల్ని పక్కకు తోసివేసి పంచాయతీ కార్యాలయానికి రంగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులపై నల్ల రంగు పడింది.
వెలగపూడిలో పరిస్థితి ఉద్రిక్తం